మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు

ఓఖీ తుఫాన్ ప్రభావంలో ముంబైతో పాటూ మహారాష్ట్ర, గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అటు గుజరాత్ లోని తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తమిళనాడు, కేరళ, లక్ష్యద్వీప్ ల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. కన్యాకుమారిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.