‘మళ్లీ రావా’కు సెన్సార్ ప్రశంసలు!

సుమంత్, ఆకాంక్షసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్లీ రావా’. గౌతమ్ తిన్నసూరి దర్శకుడు. రాహుల్‌ నక్క నిర్మాత. ఈ నెల 8న ఈ సినిమా విడుదలకానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా  దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. “సంగీతభరిత ప్రేమకథా చిత్రమిది. ఓ యువకుడి ప్రేమ ప్రయాణంలోని మూడుదశల అనుభవాల సమాహారంగా సాగుతుంది. హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయి. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించారు” అని చెప్పారు. అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ అందిస్తున్నారు.