మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గడిచిన రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించడంతో అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.30,500కి చేరుకుంది. కాగా, వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.39,150కి చేరుకుంది. అయితే పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడం వల్లే వెండి భారీగా పుంజుకోలేకపోయిందని బులియన్ ట్రేడర్ విశ్లేంచారు. ఇక న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగి 1,279.60 డాలర్లకు చేరుకుంది.