బ్రిటన్‌ ప్రధాని హత్యకు కుట్ర!

బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేను హతమార్చేందుకు పన్నిన కుట్రను ఆ దేశ భద్రతాసంస్థలు భగ్నం చేశాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ.. బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన జకారియా రెహ్మాన్‌, పాకిస్థాన్‌ సంతతికి చెందిన ఆకిబ్‌ ఇమ్రాన్‌లను అరెస్టు చేశాయి. డౌనింగ్‌స్ట్రీట్‌ గేట్లను బాంబుతో పేల్చి.. కత్తులతో థెరిసాపై దాడి చేయడానికి రెహ్మాన్‌ వ్యూహంపన్నినట్లు అభియోగాలు మోపారు. ఇటు ఈ కుట్రతో ఇమ్రాన్‌కు సంబంధం లేదని.. అతడు వేరే ఉగ్రదాడుల కోసం సన్నాహాలు చేస్తున్నాడని తెలిపాడు. బ్రిటన్‌ రాకుమారుడైన జార్జ్‌ చదువుతున్న పాఠశాల చిరునామా, ఇతర వివరాలను.. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఇతరులకు చెరవేసిన హస్నెయిన్‌ రషీద్‌ అనే వ్యక్తిని పోలీసులు లండన్‌ కోర్టులో హాజరుపరిచారు. ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరేందుకు రషీద్‌ సిరియాకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకున్నట్లు ఆరోపించారు.