బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  ఇప్పటి వరకు బీసీలకు అమలవుతున్న పథకాలపై ఈ సమావేశంలో సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు సీఎం మరిన్ని వరాలు ప్రకటించనున్నట్లు సమాచారం.