బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విజన్

బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎంబీసీలకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. బీసీల సమస్యలపై టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ రేపు సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి బీసీ సమస్యలపై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.  బీసీల అభివృద్దికి సీఎం కేసీఆర్ విజన్ తో ముందుకు పోతున్నారని ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ప్రకాష్ గౌడ్, అంజయ్య అన్నారు.