బీచుపల్లిలో కడియం పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా బీచుపల్లి గురుకుల పాఠశాలలో హాస్టల్ భవనం, భోజన శాలను కడియం శ్రీహరి ప్రారంభించారు. రూ. 2.90 కోట్లతో వసతి గృహం, భోజనశాలను నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.