బిషప్ కుటుంబ సభ్యులకు ఎంపీ కవిత పరామర్శ

సీఎస్ఐ మెదక్ డయాసిస్ మాజీ బిషప్ రెవరెండ్ డాక్టర్ సుగంధర్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని సుగంధర్ నివాసానికి వెళ్లిన కవిత, సుగంధర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రైస్తవ సమాజానికి సుగంధర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మెదక్ చర్చికి సుదీర్ఘ కాలం బిషప్ గా పనిచేసిన సుగంధర్ మృతి తీరని లోటన్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, మైనంపల్లి హన్మంతరావు, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, కంటోన్మెంట్ ఉపాధ్యకులు రామకృష్ణ, టిఆర్ఎస్ కంటోన్మెంట్ ఇంచార్జ్ గజ్జెల నగేష్, నక్క ప్రభాకర్ గౌడ్, శంకర్ లూక్, కృపాకర్, మెథడిస్ట్ చర్చ్ ఫాథర్ ఏసుదాస్, న్యూ జెరూసలేం చర్చ్ బిషప్ ధన్ రాజ్, జయాకర్ డేనియల్ – వైఎంసీఏ, సతీష్ ముద్దామల్లే కవిత వెంట ఉన్నారు.