ప్రియాంకకు మెయిల్స్ పంపకండి!

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. ఆమె ప్రస్తుతం ‘క్వాంటికో’ అనే అమెరికన్‌ టీవీ సిరీస్‌లో నటిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌ సెట్‌లో ప్రియాంక సహనటుడు అలన్‌ పావెల్‌ ఆమె గురించి ఓ షాకింగ్‌ నిజాన్ని బయటపెట్టాడు. ఆమె మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని నవ్వుతుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రియాంక 2,67,623 సందేశాలను చదవకుండా వదిలేసారని చూపించాడు. ‘గాయ్స్‌.. ప్రియాంక చోప్రాకు మెయిల్స్ పంపకండి. ఆమె వాటిని ఎప్పుడూ చదవరు. ఇది ఓ కొత్త రికార్డు’ అంటూ అలన్‌ తన పోస్ట్‌లో రాశాడు.  ‘క్వాంటికో’ సిరీస్‌ ద్వారా ప్రియాంకకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2016 ‘జై గంగాజాల్‌’ తర్వాత ఆమె ఇటీవల బాలీవుడ్‌లో రెండు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం.