ప్రభుదేవ డ్యాన్స్ గురువు కన్నుమూత

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవ గురువు బాడిగ ధర్మరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ధర్మరాజు ఇవాళ తుదిశ్వాస విడిచారు. ధర్మరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న ప్రభుదేవ.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ కు చేరుకుని గురువు భౌతికకాయానికి నివాళులర్పించారు. మోకాళ్లపై సాష్టాంగపడి పూలమాల వేసి గురుభక్తిని చాటుకున్నాడు.

20వ ఏట నుంచే డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న ధర్మరాజు.. తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడిన ఆయన.. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయభానుతో పాటు ప్రముఖ హీరోలకు డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ లలో శిక్షణ ఇచ్చారు. లవకుశ, సీతారామ కల్యాణం, ఆదిత్య 369, పౌర్ణమితో పాటు సుమారు వందకు పైగా సినిమాలకు ఆయన డ్యాన్స్ మాస్టర్ గా పని చేశారు.