పేదవారి సొంతింటి కలను నిజం చేస్తాం

పేదవారి సొంతింటి కలను నిజం చేసే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల ఆత్మగౌరవం కాపాడతామని ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సీఎం కేసీఆర్ మాటిచ్చారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లతో పాటు.. రైతులకు నిరంతర విద్యుత్ కూడా ఇస్తున్నారని అన్నారు. అసంపుర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. రెండు పంటలకు నీరందిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.