పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు

నల్లగొండ జిల్లా చిట్యాలలో డబుల్ బెడ్రూం  ఇండ్ల నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలో నల్లగొండ, మిర్యాలగూడలో ఇండ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఇండ్ల నాణ్యత, నిబంధనల అంశాల్లో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ  అన్న ఆయన.. ఇండ్లు లేని పేదలందరికి లబ్ధి చేకూరే వరకు కొనసాగుతుందని తెలిపారు.