పాలమూరుకు కనీవినీ ఎరుగనన్ని నిధులు

రాష్ట్రంలో అన్నిజిల్లాల కంటే ఎక్కువ నిధులు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఏడాదికి 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. కడుపులో పడ్డ బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉన్నాయని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కావాల్సినవాళ్లు తమ దగ్గరికి వస్తే ఎంతమందికైనా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పొద్దటి నుంచి అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లోనే గడుపుతుంటారని జితేందర్ రెడ్డి ప్రశంసించారు.

ఈ సభలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.