పార్లమెంట్ వేదికగా గే పార్ట్నర్‌కు ప్రపోజ్!  

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహన్ని చట్టబద్దం చేయాలన్న అంశంపై దిగువ సభలో చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రజాప్రతినిధి టిమ్ విల్సన్ చర్చలో మాట్లాడుతూ తన గే భాగస్వామికి ప్రపోజ్ చేశారు. లిబరల్ పార్టీకి చెందిన 37 ఏళ్ల టిమ్ విల్సన్ గే మ్యారేజ్‌ను సమర్థించారు. తన పార్ట్నర్‌తో ఏకం అయ్యేందుకు పడ్డ కష్టాలను ఆయన వివరించారు. చాలా భావోద్వేగంగా తన గే బంధాన్ని వివరించారు. ఆ తర్వాత పబ్లిక్ గ్యాలరీలో ఉన్న తన భాగస్వామి పాట్రిక్ బోల్గర్‌కు తన మ్యారేజ్ ప్రపోజల్‌ను వెల్లడించారు. బోల్గర్ కూడా చిరునవ్వు నవ్వి ఆ ఎంపీ చేసిన ప్రపోజ్‌లకు తల ఊపాడు. మరోవైపు సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు చట్టబద్దత కల్పించరాదని ఆస్ట్రేలియాలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఓ ఎంపీ తన పార్ట్నర్‌కు సభలోనే ప్రపోజ్ చేయడం విడ్డూరంగా మారింది.