పాతబస్తీలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను నగర కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించే ప్రాంతాలను సీపీ పరిశీలించారు.