పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తా!

వచ్చే ఏడాది జరుగనున్న పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ముంబై ఉగ్రదాడి సూత్రధారి(28/11), జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. ఇప్పటికే హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే దీనిని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ తాను ఎంఎంఎల్ పార్టీ పేరుపైనే పోటీ చేస్తానని హఫీజ్ సయీద్ తెలిపాడు. ఒకవేళ ఈ పార్టీ పేరుపైన పోటీ చేయడానికి వీలుకుదరకపోతే హఫీజ్ సయీద్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.