పాకిస్తాన్‌లో ఉగ్రదాడి, 9 మంది మృతి

పాకిస్తాన్‌లోని పెషావర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అగ్రికల్చర్ డైరెక్టరేట్ భవనంపై ఈ ఉదయం 8.15 గంటలకు ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖైబర్ టీచింగ్ హాస్పిటల్‌కి తరలించారు. బుర్ఖాలు వేసుకున్న నలుగురు ఉగ్రవాదులు డైరెక్టరేట్ భవనంలోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను తెహ్రీక్ తాలిబన్ సంస్థకు చెందిన వారిగా నిర్ధారించారు.

అటు 2014, డిసెంబర్ 16న పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 132 మంది పిల్లల ప్రాణాలు తీశారు.  2016, జనవరి 20న బచఖాన్ యూనివర్సిటీలో ముష్కరులు కాల్పులు జరపడంతో 21 మంది(విద్యార్థులు, స్టాఫ్) ప్రాణాలు కోల్పోయారు.