పంజాబ్‌లో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్

పంజాబ్ పోలీసులు ఓ ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. బటలకు చెందిన గుర్ముఖ్ సింగ్ అనే వ్యక్తి భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. 2009, 2012 సంవత్సరాల్లో  ఓ సిక్కు బృందంతో పాటూ పాకిస్థాన్ కు వెళ్లాడని, అదే సమయంలో ఐఎస్ఐకి చెందిన వ్యక్తులతో చర్చలు జరిపాడని గుర్తించారు. అయితే భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించి.. ఐఎస్ఐకి అందించినట్లు గుర్ముఖ్ ఒప్పుకున్నాడు. ఇంటలిజెన్స్ సమాచారంతో.. గుర్ముఖ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు.