నిలకడగా ఆడుతున్న శ్రీలంక

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మూడోరోజు తొలి సెషన్‌లో శ్రీలంక నిలకడగా ఆడింది. ఓవర్‌నైట్‌ స్కోరు 131/3తో ఆట కొనసాగించిన ఆ జట్టు లంచ్‌ విరామానికి  వికెట్‌ నష్టపోకుండా 192 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 57తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఏంజెలో మాథ్యూస్‌ 90 పరుగులు చేశాడు. ఆచితూచి ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. శ్రీలంక సారథి దినేశ్‌ చండిమాల్‌ (52) హాఫ్ సెంచరీతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.  మాథ్యూస్, చండిమాల్ 315 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.