నిరుద్యోగులు కోదండరాం మాటలు నమ్మొద్దు

నానాయాగీ చేసి నిర్వహించిన కొలువుల కొట్లాట సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి. సీఎం కేసీఆర్‌ ఉద్యోగాలు ఇస్తారనే భరోసా నిరుద్యోగుల్లో ఉన్నందుకే కొలువుల కొట్లాటకు ఎవరూ రాలేదన్నారు. కోదండరాం నిరుద్యోగులను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని రవి మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవ్వరూ కోదండరాం మాటలు నమ్మొద్దని సూచించారు.

కోదండరాం వ్యవహారం చూస్తుంటే విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టుగా ఉందని పిడమర్తి రవి అన్నారు. ఓయూలో మురళి అనే విద్యార్థి చదువులో వెనకబడి ఆ ఒత్తిడితో చనిపోయిండని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తోందని, విద్యార్థులు, నిరుద్యోగులు శ్రద్ధగా చదువుకొని బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని సూచించారు.