దీపికను వెనక్కి నెట్టిన ప్రియాంక!

మోస్ట్ సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ గా ప్రియాంక చోప్రా ఎంపికైంది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని ఈస్ట్రన్ ఐ ఎడిటర్ తెలిపారు. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.