త్వరలో శృతికి మూడు ముళ్లు!

క‌మ‌ల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాస‌న్ మ‌రోసారి వార్త‌ల‌లోకి ఎక్కింది. కొంత కాలంగా లండ‌న్ న‌టుడు మైఖేల్ కోర్సెల్‌తో స‌న్నిహితంగా ఉంటున్న శృతి రీసెంట్‌గా ఆయ‌న‌ని ముంబైకి తీసుకు వ‌చ్చి త‌న త‌ల్లి సారికకి ప‌రిచ‌యం చేసింద‌ట‌. అంతేకాదు వీరంద‌రు క‌లిసి రెస్టారెంట్‌కి వెళ్లి స‌ర‌దాగా గ‌డిపార‌ని తెలుస్తుంది. మైఖేల్‌, శృతి, సారిక కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటో సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే శృతి పెళ్ళి జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. గ‌తంలోను శృతికి, మైఖేల్‌కి సంబంధించి ప‌లు రూమ‌ర్స్ రావ‌డంతో దీనిపై స్పందించిన శృతి ద‌య‌చేసి త‌నపై పుకార్లు పుట్టించ‌వ‌ద్ద‌ని కోరింది. మ‌రి తాజా పరిణామాలపై ఏం చెబుతుందో చూడాలి. ప్ర‌స్తుతం త‌న కమల్‌ తెర‌కెక్కిస్తున్న శ‌భాష్ నాయుడు మూవీ త‌ప్ప.. శృతి మ‌రే ప్రాజెక్ట్ చేయ‌డం లేదు.