తెలుగు మహాసభల ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటి

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, చందూలాల్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.