తెలుగువాళ్లంతా గర్వపడేలా ప్రపంచ మహాసభలు

ప్రపంచ న‌లుదిశల్లో ఉన్న తెలుగువాళ్లంతా గర్వపడేలా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మహాసభలు నిర్వహిస్తుందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెప్పారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా జిల్లా గ్రంథాల‌య సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. మినీ ట్యాంకు బండ్ పై ఏర్పాటు  చేసిన కార్యక్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా వాసులందరిని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. ప్రవాస భారతీయులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులు, కవులు, పండితులు, కళాకారులు తమ ప్రతిభను మహాసభల్లో ప్రదర్శించి సాంస్కృతిక దీప్తిని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలుగు మహాసభలను ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి, ఇంటి పండుగగా నిర్వహించుకోవాలని సూచించారు.