తుపాకులగూడెం బ్యారేజీ పనులు పరిశీలించిన సీఎం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు సీఎం కేసీఆర్. తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తుపాకుల గూడెం చేరుకున్న సీఎం… బ్యారేజీ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించిన ఆయన.. పలు సూచనలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ పలువురు నేతలు బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు.