తాప్సీ దశ తిరిగేనా?

ఆనందోబ్రహ్మ చిత్రంతో తెలుగులో చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది తాప్సీ. ప్రస్తుతం పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డది. తాజాగా ఈమె మరో ప్రయోగానికి సిద్ధమైంది. యాక్షన్ ఇతివృత్తంతో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎమ్.వి.వి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రంలో తాప్సీ పాత్ర మూసధోరణికి భిన్నంగా సాగుతుందట. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రారంభించనున్నట్లు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ తెలిపారు. తాప్సీతో పాటు మరో కథానాయిక ఈ సినిమాలో నటించనున్నది. లవర్స్ ఫేమ్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎమ్.వి.వి సత్యనారాయణ నిర్మాత. ఇప్పటివరకు తెలుగు తెరపై రాని కథాంశమిదని, మంచి కథతో తెలుగులో మరో సినిమా చేస్తానని అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని తాప్సీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.