తమిళనాడులో పలు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓఖీ తుఫాన్‌  బీభత్సం కొనసాగుతోంది. తుఫాన్‌ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల ధాటికి అక్కడక్కడ భారీ వృక్షాలు, కరెంట్ స్తంబాలు నేల కూలాయి. ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ముందస్తు జాగ్రత్తగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు తమిళ అధికారులు. పలు రైళ్లను కూడా రద్దు చేశారు. భారీ వర్షాలతో శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సన్నిధానం, పంబ దగ్గరనున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ..మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.