లారీ-వ్యాన్ ఢీ: 10 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్ వ్యాన్ ను లారీ ఢీకొనడంతో.. పది మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుచ్చి జిల్లా తవరన్ కురుచ్చి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్టేషనరీ సామాన్లు తీసుకువస్తున్న లారీ వేగంగా టెంపోను ఢీకొట్టడంతో.. టెంపు నుజ్జు నుజ్జయింది. దీంతో పలు మృతదేహాలు టెంపోలో చిక్కుకుపోయాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. వీరంగా నాగర్ కోయిల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.