ఢిల్లీ టెస్టులో మురళీ విజయ్ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న ఢిల్లీ టెస్ట్‌లో టీంఇండియా ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ ధావన్, పుజారా 23 పరుగులకు వెనుదిరిగినా… విజయ్ సూపర్ ఫాంని కంటిన్యూ చేశాడు. సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించి సత్తా చాటాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. 163 బంతుల్లో 9 బౌండరీలతో విజయ్ తన టెస్ట్ కెరీర్‌లో 11వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు భీకర ఫాంలో ఉన్న కెప్టెన్ కోహ్లి సైతం సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌ లో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. విజయ్ 101, కోహ్లి 94 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.