ఢిల్లీ టెస్టుకు కాలుష్యం అడ్డంకి

ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక మూడో టెస్టులకు కాలుష్యం అడ్డంకిగా మారింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 123వ ఓవర్ వేస్తున్న లంక బౌలర్ గమాగె సడెన్‌గా  కుప్పకూలడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పరిసరాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నదని తెలవడం లంక ప్లేయర్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లంక కెప్టెన్ చండీమాల్ అంపైర్లతో  పొల్యూషన్ పై చర్చించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడలేమని చెప్పగా.. అంపైర్లు అతనికి సర్ది చెప్పారు. దీంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. గత కొద్ది నెలలుగా ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. గత నెలలో  కాలుష్యం కారణంగానే  రెండు రంజీ మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇప్పుడు కాలుష్యం వల్ల సుమారు 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది.