ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఉత్తర భారతం ఉలిక్కిపడింది. ఢిల్లీ, ఉత్తరాంచల్‌ తో పాటు పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకొని సతమతమవుతున్న ఢిల్లీవాసులను ఈ భూకంపం మరింత భయపెట్టింది. గురుగ్రామ్ ప్రాంతంలో ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చారు.

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతే కాకుండా తూర్పు డెహ్రాడూన్‌కు 121 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపక కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఐతే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.