ఢిల్లీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు అనుమానమే!

వాయు కాలుష్యం కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఢిల్లీలో నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంత మైదానంలో ఆడే మ్యాచ్‌లన్నింటినీ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియానికి మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  భారత్‌-శ్రీలంక మధ్య దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మూడో టెస్టుకు వాయు కాలుష్యం వల్ల తీవ్ర ఆటకం ఏర్పడింది. ఇరు జట్ల పేసర్లు లక్మల్‌, షమి మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కాసేపు మైదానాన్ని కూడా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంత మైదానం ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహిస్తే సమస్యలు తలెత్తవచ్చని బీసీసీఐ ప్రతినిధుల అనుమానిస్తున్నారు. అందుకే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంత మైదానంలో నిర్వహించే మ్యాచ్‌లన్ని తిరువనంతపురం మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నారు.  ఈ అంశంపై బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు  కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జయేశ్‌ జార్జి తెలిపారు.