ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉదయం తొమ్మిది గంటలైనా పొగమంచు కమ్ముకోని ఉండటంతో జనం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో పొల్యూషన్ లెవల్స్ కూడా పెరిగాయి. వాతావారణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఇక పొగ మంచు కారణంగా జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 25 రైళ్లను  ఆలస్యంగా నడుపుతున్నారు. 4 రైళ్ల సమయాల్లో మార్పులు చేసిన రైల్వే అధికారులు..6 రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసుల వేళ్లలో మార్పులు చేశారు.