ట్రిపుల్‌ తలాక్ చెప్తే మూడేళ్లు జైలుశిక్ష!

ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం ఈ దిశగా కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేసింది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా చట్టంలో మార్పులు చేయనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది మోడీ సర్కార్. న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు సంయుక్తంగా ముసాయిదాను రూపొందించాయి. ఐతే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల కేంద్రం బృందంతో చర్చించనుంది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.