టెస్టుల్లో కోహ్లీ 5 వేల పరుగులు

ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 5 వేల పరుగులను పూర్తి చేశాడు.  తొలి రోజు కోహ్లీ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ ఈ ఘనతను చేరుకోవడం విశేషం. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ కూడా 105 టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 5 వేల పరుగులను పూర్తి చేశాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన ఐదవ ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అత్యంత వేగంగా ఆ మార్క్‌ను అందుకున్న నాలుగవ భారతీయ క్రికెటర్‌గా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం కోహ్లీ 87, విజయ్ 95 రన్స్‌తో ఆడుతున్నారు. భారత్ 54 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.