టీఎస్‌ పోలీసులకు అమెరికా కాన్సులేట్ ప్రశంసలు  

తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసలందించింది. జీఈఎస్ బాగా నిర్వహించారని తెలంగాణ పోలీసులకు కితాబిచ్చింది. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని డీజీపీ మహేందర్‌రెడ్డికి అమెరికా కాన్సులేట్ జనరల్ లేఖ రాశారు. ఇప్పటికే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్-2017)ను ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రత కల్పించిన డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్)అంజనీకుమార్‌ను నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ ప్రశంసించారు.