టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకుంది. ఈ మ్యాచ్‌ గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకునేందుకు కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. అటు కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహ్మద్‌ షమి తిరిగి తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆటగాళ్ల ఫామ్‌లేమీ, వరుస పరాజయాలతో తీవ్రంగా ఇబ్బందులుపడుతున్న లంకేయులు పరువును కాపాడుకునే పనిలో ఉన్నారు. అందని ద్రాక్షగా ఊరిస్తున్న భారత్ గడ్డపై తొలి విజయం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.