చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!

తమకు నచ్చిన హీరోయిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్న యువతులను చూశాం. నలుగురి దృష్టి తమవైపు తిప్పుకునేందుకు ట్రెండ్ కు తగ్గట్లు తయారయ్యే మోడల్స్ ను చూశాం. కానీ కెనడాకు చెందిన కాట్ గాల్లింగర్ అనే మోడల్. అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటంతో.. కుడి కన్ను తెల్లగుడ్డుకు పర్పుల్ కలర్ ఇంక్ తో టాటూ వేయించుకుంది. దాంతో ఆమె కంటి చూపు కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఆమె కంటి చూపి క్రమంగా మందగిస్తూ వస్తోంది. అంతే కాదు.. రోజూ తన కంట్లో నుంచి ఆ కలర్ కారుతూ ఉంటుంది. కంటి సమస్య నుంచి బయట పడటానికి కాట్ వాడని మందులు లేవు.. తిరగని హాస్పిటల్స్ లేవు. ఏం చేసినా.. కంటి చూపును మాత్రం తిరిగి సంపాదించడం అసాధ్యం అని డాక్టర్లు తేల్చేశారు.