చెలరేగిన విరాట్, విజయ్!

శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మురళీ విజయ్ సెంచరీలతో ఫస్ట్ డే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. సిరీస్ లో వరుస శతకాలతో కోహ్లీ, విజయ్  మూడో వికెట్‌కు 283 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఓపెనర్ శిఖర్ ధావన్, పుజారా భారీ స్కోర్స్ సాధించకపోయినా… కోహ్లీ, విజయ్ లు చేలరేగి ఆడారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ… శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి కోహ్లి 156, రోహిత్‌ శర్మ6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మురళీ విజయ్ 155, శిఖర్ ధావన్ 23, పుజారా 23 రన్స్ చేశారు. శ్రీలంక బౌలర్లలో సండకన్‌ 2, గమగె, పెరీరా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.