గెలుపుకు చేరువలో భారత్ 

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టును టీమిండియా గెలవడం దాదాపుగా లాంఛనమే. లంకేయులు అద్భుతం చేస్తే తప్ప.. రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో సిరీస్‌ భారత్‌ సొంతమైనట్లే. కోహ్లి, రోహిత్‌, ధావన్‌ ధాటిగా ఆడడంతో భారత్‌.. లంక ముందుంచిన లక్ష్యం 410 పరుగులు. కనీసం పోరాటానికే కష్టపడుతున్న ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు ఈ భారీ స్కోరును అందుకోవడం అసంభవమే. కనీసం డ్రా కూడా కష్టమేనని నాలుగో రోజు ఆట చివరికి తేలిపోయింది.  విజయానికి భారత్‌కు కావాల్సింది ఏడు వికెట్లే కాగా.. లంక చేయాల్సింది 379 పరుగులు. జడేజా విజృంభిస్తున్న వేళ.. అస్థిరంగా బౌన్స్‌ అవుతున్న పిచ్‌ లంకేయలను మరింత కఠినంగా పరీక్షంచనుంది. ప్రస్తుతం డిసిల్వా, మాథ్యూస్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బాట్స్ మెన్ రాణించడంతో.. 5 వికెట్లకు 246 పరుగుల దగ్గర కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.