గుజరాత్ లో ప్రచారానికి ఓఖీ బ్రేక్

తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికించిన ఓఖీ తుఫాన్ ప్రస్తుతం దక్షిణ గుజరాత్ దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో సూరత్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 3200 మందిని గుజరాత్ తీర ప్రాంతాల నుంచి తరలించారు. మరో 48 గంటల పాటు ఓఖీ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఓఖీ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తుపాన్‌ గుజరాత్‌ తీరాన్ని తాకడంతో పలు రాజకీయ పార్టీలు సూరత్‌ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రచార సభలను రద్దు చేశాయి. సూరత్‌లో ఇవాళ జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీని రద్దు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోర్బి, దర్బంగా, సురేం‍ద్రనగర్‌ ర్యాలీలు రద్దు చేసినట్టు పార్టీ నేతలు ప్రకటించారు.