గవర్నర్‌ను కలిసిన అమెరికా ప్రతినిధులు

గవర్నర్ నరసింహన్‌ను అమెరికా ప్రతినిధుల బృందం కలిసింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ నరసింహన్ అమెరికా ప్రతినిధులకు వివరించారు. రెండు రాష్ర్టాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. ఇరు రాష్ర్టాలు నీరు విద్యుత్, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ అమలు బాగుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. షీ టీమ్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాజ్‌భవన్‌లో పూర్తి సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటైందని గవర్నర్ నరసింహన్ అమెరికా ప్రతినిధులకు వివరించారు. రెండు రాష్ర్టాలు వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇచ్చే స్థాయికి చేరాయన్నారు. రానున్న ఐదేళ్లలో రెండు రాష్ర్టాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తాయి.