కొత్త పంచాయతీరాజ్ చట్టంపై కసరత్తు

కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు టీఎస్ అపార్డ్ లో సమీక్ష జరుపుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దేశానికే ఆదర్శoగా చట్టాన్ని రూపొందిద్దామని మంత్రి జూపల్లి చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బంధీగా రూపొందించాలని అన్నారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చట్టం తేవాలన్నారు.