కుంభమేళాకు యునెస్కో గుర్తింపు

హిందువుల పవిత్ర వేడుక కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. దక్షిణకొరియాలోని జెజూలో జరుగుతున్న 12వ శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ సంపదల జాబితాలో యునెస్కో చేర్చింది. ఇప్పటి వరకు బోట్స్‌వానా, కొలంబియా, వెనెజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యూఏఈలో జరిగే వేడుకలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. కుంభమేళా సమయంలో కోట్లాది మంది హిందువులు నది వద్దకు చేరుకొని వేడుక చేసుకుంటారు. ప్రపంచంలో అంత భారీ మొత్తంలో భక్తులు హాజరవడం ఒక్క కుంభమేళాకు మాత్రమే సాధ్యం. ఈ నేపథ్యంలోనే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఇకపై ఈ మహా వేడుకకు యునెస్కో సభ్య దేశాలు సహాయ సహకారాలు అందించి, దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటాయి.