కాళేశ్వరం పనులు పరిశీలించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలన్న దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ.. ప్రతి ఎకరానికి సాగునీరిచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జోరుగా  సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నరు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం కేసీఆర్.. తీగలగుట్టపల్లికి వెళ్లారు. ముఖ్యమంత్రికి తీగులగుట్టపల్లిలో గ్రాండ్ వెల్ కం లభించింది.

ఇవాళ ఉదయాన్నే సీఎం కేసీఆర్  ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కానున్నది. ముందుగా తీగలగుట్టపల్లి నుంచి తుపాకులగూడెం బ్యారేజీకి  సీఎం కేసీఆర్  చేరుకోనున్నరు. తుపాకుల గూడెంలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నరు. అక్కడ నుంచి హెలీకాప్టర్ ద్వారా  మేడిగడ్డ వెళ్లి… బ్యారేజీ పనులు జరిగే తీరును తెలుసుకుంటారు. తర్వాత  కన్నెపల్లి పంప్ హౌజ్  దగ్గరకు వెళ్లనున్న సీఎం….  నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం  అన్నారం బ్యారేజీ పనులను,  ఆ తర్వాత సిరిపురం పంప్ హౌజ్  పనులను పరిశీలిస్తారు. అక్కడే మధ్యాహ్న విరామం తీసుకోన్నరు.

సిరిపురంలో లంచ్  చేసిన తర్వాత సీఎం కేసీఆర్…సుందిళ్ల బ్యారేజీకి  బయలుదేరుతారు. అక్కడ బ్యారేజీ పనులను పరిశీలించనున్నరు. తర్వాత గోలివాడ పంప్ హౌజ్ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం ఎన్టీపీసీ రామగుండం చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నరు.

మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మేడారం, రామడుగు, రాంపూర్ లో సీఎం కేసీఆర్  పర్యటించనున్నరు.