కాళేశ్వరంపై రేపు ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష

నిన్న (గురువారం) ఉదయం నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్, పనుల పురోగతిపై రేపు (9న) కూలంకషంగా సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి  అన్ని శాఖల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులు సీజన్‌లోగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.