కాంగ్రెస్ అంటే ఔరంగజేబ్ రాజ్యం!

రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయడం ద్వారా తమది కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ మరోసారి ఒప్పుకుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ అంటే మరో ఔరంగజేబ్ రాజ్యం లాంటిదేనని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధరమ్ పూర్ లో నిర్వహించిన సభలో మోడీ పాల్గొన్నారు. జహంగీర్ తర్వాత షాజహాన్… ఆయన తర్వాత ఔరంగజేబ్ పదవి చేపడుతారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు ప్రధాని. ఇలాంటి కుటుంబ పాలన దేశానికి, గుజరాత్ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. తమకు 125 కోట్ల మంది ప్రజలే హైకమాండ్ అని, వారి తీర్పే శిరోధార్యమన్నారు.