కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్

మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తీగలగుట్టపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలకు బదులు పూలమొక్కలను అందించారు. ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు.

సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికిన వారిలో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సతీష్ కుమార్, మేయర్ రవీందర్ సింగ్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.