కరీంనగర్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్

ప్రాజెక్టుల సందర్శన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ బయలు దేరారు. అక్కడ ఈ రాత్రి అధికారులు, నాయకులతో మాట్లాడుతారు. రేపు (గురువారం) తుపాకుల గూడెం బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజిని, కన్నెపల్లి పంపుహౌజ్ ను, అన్నారం బ్యారేజిని, సిరిపురం పంపుహౌజ్ ను, సుందిళ్ల బ్యారేజిని, గోలివాడ పంపుహౌజ్ ను సందర్శిస్తారు. ఎల్లుండి (శుక్రవారం) మేడారం, రామడుగు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, రాంపూర్ వద్ద పంపు హౌజ్ పనులను, మిడ్ మానేరు పనుల పురోగతిని పరిశీలిస్తారు.