కన్నెపల్లి పంప్‌హౌజ్ పనులు పరిశీలించిన సీఎం

మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలించిన అనంతరం.. కన్నెపల్లి దగ్గర పంప్ హౌజ్ నిర్మాణాన్ని పరిశీలించారు సీఎం కేసీఆర్. నలభై నిమిషాల పాటు అక్కడే ఉన్న సీఎం.. పంప్ హౌజ్ నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ పలువురు నేతలు బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు.